కొత్త శీర్షిక – Blog of The Day

తెలుగులో ఈమధ్యన చాలామంది బ్లాగులు రాస్తున్న సంగతి ఇక్కడ వరకూ చేరిన మీకు ఈ పాటికే తెలిసి వుంటుంది. మొదట్లో పది పదిహేను మంది బ్లాగరులు వున్నప్పుడూ అందరి వ్యాసాలను చదివి వ్యాఖ్యలు చేసే అవకాశం వుండేది. కానీ నేడు షుమారు 500లకు చేరుకున్న తెలుగు బ్లాగులు అన్నీ ఒకే సారి చదవడం కష్టమైపోతుంది చాలామందికి. కూడలి, తేనెగూడు, తెలుగుబ్లాగర్స్, జల్లెడ లాంటి సైట్లు బ్లాగులన్నింటినీ ఒక దగ్గరకు చేర్చే ప్రయత్నాలు చేయడం ఆనందదాయకం. ఇటువంతి ప్రయత్నాల్లో భాగంగానే నేను TBOD(Telugu Blog Of The Day) మొదలు పెట్టడం జరిగింది.ఇక్కడ ప్రతిరోజూ ఒక్కో తెలుగు బ్లాగు గురించి విశ్లేషిస్తూ, ఆయా బ్లాగుల్లోని ప్రాచుర్యం పొందిన మరియు ఆసక్తి కరమైన విష్యాలను క్లుప్తంగా తెలియచేయాలనేదే నా ఈ ప్రయత్నం. వున్న బ్లాగులన్నింటిలోనూ ఏది ముందుగా విశ్లేషించాలి, ఏది తర్వాత విశ్లేషించాలి అన్నది కష్టమైన ప్రశ్నే! అందుకు నేను పాటిస్తున్న నియమావళి ఇది.

1)కూడలి తెరవుట.

2)అందులో మొదటిగా లిస్టు అయ్యివున్న బ్లాగును విశ్లేషించుట.

3)ఆ బ్లాగు ఇప్పటికే విశ్లేషించబడినదయితే, లిస్టులోని రెండో బ్లాగుని విశ్లేషించుట.

4)ఒకవేళ అదీ విశ్లేషించబడిన బ్లాగయితే తరువాతి బ్లాగుని విశ్లేషించుట.

5)నాలుగో నియమం చూడుట.

మీ బ్లాగు ఎప్పుడోకప్పుడు తప్పకుండా వస్తుంది, ఎదురుచూడండి.

3 responses to “కొత్త శీర్షిక – Blog of The Day

  1. ఇలాంటి ప్రయత్నం చేస్తున్నందుకు అభినందనలు…..
    (‘ కొత్త శీర్షిక’ ఏడవ లైన్ లో ‘ఇటువంటి’ బదులుగా ‘ఇటువంతి’ అని వచ్చింది… మామూలుగా అయితే పరవాలేదుగానీ, గూగుల్ లో మీ బ్లాగ్ ని వెతికితే వచ్చే జవాబుల్లో ఆ పదమే మొదటగా కనిపిస్తోంది.)

  2. mee jalleda .com baaguMdi ilaaMTvi iMkaauMTe baaguMTMdi selavu rajeswari from u.s

  3. Awaiting your review on my blog

Leave a comment