Blog of the Day: Telugu

ఈ రోజు బ్లాగు – జగన్నాటకం

August 6, 2007 · 4 Comments

తేదీ: ఆగష్టు 06, 2007

చిరునామా:http://jagannaatakam.blogspot.com

గురించి:ఈ బ్లాగు సొంతదారులు తమ గురించి ఏమీ చెప్పుకోలేదు., “ఈ అద్భుత జగన్నాటకం లో లక్షల పాత్రలు…అందులో కొన్ని ఇక్కడ మిమ్మల్ని పలకరించడానికి…” అని తప్ప.

సొంతదారు: ఈ బ్లాగు సొంతదారు ఎవరో కూడా పాఠకులకు తెలియచేయలేదు. కానీ బ్లాగులోని పోస్టులు చూస్తే మాత్రం ఇది ఒక్కరు చేస్తున్న పని కాదని అర్థమవుతుంది.జ్యోతి, త్రివిక్రం, శొధన అనే ముగ్గురు రచయితలు ఈ బ్లాగులో వ్యాసాలు రాస్తున్నరు.

విశ్లేషణ: బ్లాగు పేరు జగన్నాటకం అని చూస్తేనే అర్థమవుతుంది, ఇది పురాణాలను పుక్కిట పట్టిన వారెవరో రాస్తున్నారని. మన పురాణాల్లో వున్నన్ని పాత్రలు వేరే ఎక్కడ వుండవని మనకు తెలుసు. మన పురాణాలకున్న ప్రత్యేకత ఏంటంటే ఇందులోని ప్రతి చిన్న పాత్రకు కూడా ఒక back story వుంటుంది. సాధారణంగా మనకి భారతం, రామాయణాల్లోని ముఖ్య కథ తెలిసి వుంటుంది కానీ అందులోని పాత్రల వెనుక కథ అందరికీ తెలియక పోవచ్చు. ఉదాహరణకు భీష్ముడు శిఖండి వలన మరణం చెందాడని తెలుసు కానీ శిఖండి కథ చాలా మందికి తెలియదు. అలాగే కర్ణునికి వివిధ శాపాలున్నాయని తెలుసు గానీ ఆ శాపాలన్నీ ఎలా వచ్చాయి అన్న విషయాలు తెలియకపోవచ్చు. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఈ బ్లాగు సందర్శించడం ద్వారా చాలా తెలుసుకోవచ్చు.

చదవాల్సినవి:ఈ బ్లాగు మొదలుపెట్టి 6 నెలలయినప్పటికీ ఇందులో కేవలం పది పోస్టులే వున్నాయి. అన్ని పోస్టూలు తప్పకుండా చదవాల్సినవే! ఇందులో వున్న స్ఫూర్తి – సమయస్ఫూర్తి కథ చదువుతుంటే ఈ మధ్య మేనేజెమెంట్ వాళ్ళ కోసం వస్తున్న Who moved my cheese, Fish tales లాంటి పుస్తకాల్లోని కథలు గుర్తొచ్చాయి. జనాలు ఎగబడి ఆ పుస్తకాలు కొనడంకంటే మన పురాణల్లో ఎన్నో కథలను చదివి నేర్చుకోవలిసింది చాలా వుందనడానికి ఈ కథ ఉత్తమ ఉదాహరణ.

చివరిమాట:పురాణాల్లోని వివిధ కథలను పాఠకులకు అందచేసే మంచి ప్రయత్నంతో మొదలుపెట్టిన ఈ బ్లాగు ఇంకా ఎక్కువ కథలతో, వ్యాసాలతో అబివృధ్ధి చెందితే ఎంతో బావుంటుంది.

Categories: Blog-Of-The-Day

4 responses so far ↓

  • రానారె // August 7, 2007 at 4:23 pm

    ముగ్గురు రాస్తూకూడా ఆరు నెలల్లో కేవలం పది మాత్రమేనా!? చాలా అన్యాయం.

  • cbrao // August 8, 2007 at 8:40 am

    వంటవాళ్లు ఎక్కువైతే వంట పాడవుతుందనే సామెత ఒకటి ఉంది. ముగ్గురవటం వలన ఎక్కువ రాయలేక పోతున్నారేమో! ఈ బ్లాగుకు contributors కావాలని వారి విజ్ఞాపన కూడా ఉంది – ముగ్గురు చాలరన్నట్లుగా.

  • jyothi // August 8, 2007 at 1:15 pm

    అందులో రాసేది త్రివిక్రమ్ , శోధన సుధాకర్, నేను. వాళ్ళీద్దరు తమ ఉద్యోగాలలో బిజీగా ఉండి రాయటంలేదు. నేను ఎక్కువ రాస్తే బాగోదు అని రాయటం లేదు. లేకుంటే నా వేగం అందరికీ తెలిసిందే కదా!

  • Sowmya // August 10, 2007 at 1:56 am

    ఎక్కువ రాయడం అన్న విషయానికి మనం అంత ప్రాధాన్యత ఇవ్వనక్కరలేదు ఏమో? ఎంత విషయం ఉంది ఆ రాసిన టపాల్లో అన్న విషయం ఒక్కటి చాలేమో?? సమయం గడిచే కొద్దీ అందులో కంటెంట్ దానంతట అదే పెరుగుతుంది.

Leave a Comment